కంచలేని కారణంగా పొంచి ఉన్న పవర్ ప్రమాదం.
ప్రమాదాలు జరగకముందే విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ చరణ్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 24,
చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న కరెంటు ట్రాన్స్ఫర్మార్ కారణంగా ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం మెండుగా ఉన్నది నిరంతరం వాహనాలతో రద్దీగా వుండే మూడు బాటల కూడలి ఈ ప్రాంతం అందువల్ల అప్పుడప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ వుంటాయి
ఇక్కడే రోడ్డుకు అతి దెగ్గరగా ఈ కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ కూడా ఉన్నదని దీని చుట్టూ విద్యుత్ అధికారులు ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా కంచె ను వెయ్యడం మరిచారని ఈ విషయమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు విద్యుత్ అధికారులు ఈ ప్రమాదాన్ని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు
కొంతమంది జనం ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదం తెలియక ఈ కరెంట్ ట్రాన్స్ఫర్మార్ దిమ్మకు బ్యానర్లు కట్టడం పోస్టర్లు అంటించడం వాల్ రైటింగ్స్ రాయడం వంటివి చేస్తున్నారని అప్పుడప్పుడు పశువులు కూడా ఇక్కడే సేద తీరుతున్నాయి
మతి స్థిమితం లేని కొందరు వ్యక్తులు ఇక్కడే నిద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగితే దానికి బాధ్యుత విద్యుత్ అధికారులే తీసుకోవాలని అన్నారు
ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాద కరంగా ఉన్న ఈ కరెంటు ట్రాన్స్ఫర్ చుట్టూ తక్షణమే కంచను వేయాలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ డిమాండ్ చేశారు.