మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి తండాకు చేరవేయాలి
గిరిజన మోర్చా అసెంబ్లీ ఇన్చార్జి బానోతు బాలు నాయక్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 08
నరేంద్ర మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి తండాకు చేరవేయాలని గిరిజన మోర్చా అసెంబ్లీ ఇన్చార్జ్ బానోతు బాలు నాయక్ అన్నారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపే లక్ష్యంగా గిరిజనులు పని చేయాలని నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీలో ఏడు మండలాల గిరిజన మోర్చా కన్వీనర్, కో కన్వీనర్ ల ఎన్నిక జరిగింది.
గిరిజన మోర్చాల కన్వీనర్లు కన్వీనర్లు రాబోయే నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో గిరిజనులను చైతన్యవంతులు చేసి నరేంద్ర మోడీ పాలన వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రతి తండాల్లో ప్రచారం చేసుకుంటూ మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా గిరిజనులు ఒకే తాటిపై రావాలని కోరారు.
త్వరలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల ఆధ్వర్యంలో గిరిజన సమ్మేళనం జరుగుతుంది కావున ఈ సభను గిరిజనులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా మోర్చా మండల కన్వీనర్ లు మేళ్లచెరువు మండలం లావూరి వెంకన్న, ధరావత్ సురేష్, చింతలపాలెం మండలం బానోతు రామారావు, అజ్మీరా శ్రీరామ్, మఠంపల్లి బానోతు రంగా, భూక్యా తులిస్య,గరిడేపల్లి మండలం గుగులోతు రాజు నాయక్,
చిరంజీవి, నేరేడుచర్ల మండలం బానోతు నటరాజు, మాలోతు బాలు, పాలకీడు మండలం మాలోతు లక్ష్మణ్ నాయక్ మాలోతు అరుణ్ లను నియమించడం జరిగింది. ఇట్టి ఎన్నికలో గిరిజన మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాజు నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీ ,సీనియర్ నాయకులు చిరంజీవి, మాలోతు లక్ష్మణ్, తులసి రామ్, శివాజీ, అనిల్, రామారావు గిరిజన నాయకులు పాల్గొన్నారు.