చరిత్ర ఉన్నంతకాలం అంబేద్కర్ ఉంటారు..
ఆయన ఆశయాలను ముందుకు తీసికెళ్లాలి
అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ పాలన
పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, తాతా మధు
ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసికెళ్లాలని బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నామ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ పాలన సాగించి, దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. అంతేకాకుండా సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. నూతన పార్లమెంట్ కు ఆయన పేరు పెట్టాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతిని గుర్తు చేశారు.
సమానత్వం కోసం, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన రూపొందించిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణా రాష్ట్రం వచ్చిందన్నారు .ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకెళదామని పేర్కొన్నారు.భారత్ చరిత్ర ఉన్ననాళ్లు అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారని నామ అన్నారు. ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు.
ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ అంబేద్కర్ బాటలో కేసీఆర్ నడిచారని అన్నారు.ఆయన స్ఫూర్తితో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు ,మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్, పగడాల నాగరాజు, దిండిగాల రాజేందర్, బొమ్మెర రామ్మూర్తి, సుబ్బారావు, ఉప్పల వెంకట రమణ, చిత్తారు సింహాద్రి యాదవ్, శీలంశెట్టి వీరభద్రం,ముస్లిం మైనారిటీ నాయకులు తాజుద్దీన్, పార్టీ నాయకులు చెరుకుమల్లి రవి,వాకదాని కోటేశ్వరరావు, బెల్లం వేణు,మేకల సుగుణారావు, పలువురు కార్పొరేటర్లు జ్యోతిరెడ్డి, తదితరులతో పాటు నామ సేవా సమితి నుంచి రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.