ఓట్ల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న పలు పార్టీ రాజకీయ నాయకులు.
” కూటికోసం కోటి విద్యలు అనే సామెతను విన్నం కానీ.!”
“ఓటు కోసం కోటి తిప్పలు, ఇప్పుడు చూస్తున్నాం.!”
“స్థాయి పెరగడం వాళ్లనేనా’ ప్రజలకు దూరం.! ఓటర్లకు ఈ భారం.!”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
నాడు చర్చల పేరుతో పీపుల్స్ వార్ జనశక్తి పార్టీలను పిట్టలను చంపినట్టు చంపిన పార్టీ నాయకులు, నేడు ఓట్ల కోసం మావోయిస్టుపార్టీ సానుభూతి కొరకు ఆరాటపడుతున్న పలు పార్టీ నాయకులు.?
సమాజం లో బ్రష్టు పట్టిన రాజకీయ కార్యకలాపాలను నిలదీసేందుకు ప్రెస్ నోట్ తో సిద్ధమైన, మాజీ ఎం.పీ.పీ డాక్టర్ జాడి, రామరాజు నేత” కన్నాయిగూడెం ఏప్రిల్ 25 గురువారం రోజున కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో భారతీయ జనతాపార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎం.పీ.పీ డాక్టర్ జాడి రామరాజు నేత” మాట్లాడుతూ ఆదివాసి దళిత బహుజన వర్గాల ఓట్ల కోసం మరియు మావోయిస్టు పార్టీ సానుభూతి కొరకు సతీష్ గాడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన శంకరన్న కుటుంబాన్ని తెలంగాణ పలు పార్టీ నాయకులు పరమశించడానికి ప్రధాన కారణం ఏంటి.? అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు భాగంగా తాను మాట్లాడుతూ మావోయిస్టు పార్టీపై సానుభూతి ఉంటే, తోటి ప్రాణం మీద గౌరవం ఉంటే, సామరస్యం గా మాట్లాడాలి కానీ, ఇలా ఎన్కౌంటర్ల తో భయభ్రాంతికి గురి చేస్తే, ప్రజల సమస్యల కోసం పోరాడే పార్టీ సంఘాలు ఇక ఎలా.? జనజీవన స్రవంతిలో కలుస్తాయని అన్నారు.
అంతేకాకుండా ఒకపక్క ప్రభుత్వం ఎదురు కాల్పులు చేస్తూ, మరో పక్క అదే పార్టీకి చెందిన శ్రేణులు పోయి పరామర్శించడం ఇది ముమ్మాటికి ఓట్ల కోసం వేసే బాట కాదా.! అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో అవసరానికి అనుగుణంగా మాట్లాడే పార్టీలే ఉన్నాయి కానీ, ప్రజల అవసరాలను తీర్చే పార్టీలు మాత్రం కనుమరుగవుతున్నాయని.
నేడు తెలంగాణ రాజకీయ ప్రవర్తన గురించి మరోమారు జ్ఞాపకం చేశారు. ఆనాడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడం కోసం నాటి పీపుల్స్ వార్ జనశక్తి పార్టీలతో అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్ జనశక్తి పార్టీలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చల పేరుతో పిట్టల్ని కాల్చి చంపినట్టు చంపిన పార్టీ ఏది అనే విషయం జగమెరిగిన సత్యమే అంటూ మాట్లాడారు.
నేడు మావోయిస్టు నేత శంకర్రావు కుటుంబాన్ని పరమశించడం చూస్తుంటే మావోయిస్టు పార్టీ సానుభూతి మరియు ఆదివాసి దళిత బహుజన వర్గాలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఆ పార్టీ ఎంతకి తెగించడానికైనా సిద్ధపడింది అంటూ అంతే కాకుండా, అదేవిధంగా మావోయిస్టులపై నాటి రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఎంతోమందిని ఎన్కౌంటర్లు చేసినప్పటికీ ఒక్కరి కుటుంబ నైనా.!
పరామర్శించిన చరిత్ర ఇప్పుడున్న ఉన్నదా.! అని అన్నారు అదేవిధంగా 8 పార్టీ నాయకులు రాజకీయ అవసరాల కోసం పార్టీ నాయకులు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులతో లబ్ధి పొంది తర్వాత పక్కకు నెట్టిన చరిత్ర ఆ పార్టీకి మాత్రమే సొంతమని అన్నారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లెల్లో ఆదివాసి దళిత బహుజన వర్గాల ఇండ్లపై పోలీసులు దాడి చేసి తినే గింజలలో మందు కలిపినా” మాట్లాడని పార్టీ నాయకులు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రసార ఆర్బాటల కోసం మావోయిస్టు శంకరన్న కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదే విధంగా నాడు నేడు ఆ పార్టీ విధానాలను మేధావులైన పత్రిక మిత్రులు ఒక్కసారి గమనించాలి.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు కావాలా లేక మన ప్రాంత అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు చేసే నాయకులు కావాలో తెలియపరచాల్సిన బాధ్యతల్లో మీడియా రంగం ముఖ్యపాత్ర పోషించాలి అని అన్నారు. అదిలాబాద్ జిల్లాలో ఆదివాసి దళిత బహుజన వర్గాల ప్రజలను నమ్మించి రాజకీయ లబ్ధి పొందడం కోసం చూస్తున్నారని అన్నారు.
ఓటర జరభద్రం పోరాడితే పోయేది ఏమీ లేదు ఎదవ బానిస సంకెళ్లు తప్ప ఈ సమాజం కోసం నీ ఓటును వినియోగించు. నీ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం కరెన్సీ నోటు కి అమ్ముడుపోకు, నోటు కోసం ఒక్కరోజు తలవంచితే ఐదు సంవత్సరాలు నీ మెడలపై కూర్చుంటారు జరభద్రం కోటరా. మేలుకో యువతరమా.! భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని కన్నాయిగూడెం ప్రెస్ మీట్ లో మాజీ ఎం.పి.పి డాక్టర్ జాడి, రామరాజు అన్నారు.