HyderabadPoliticalTelangana

ఎప్పటికైనా నువ్వు రాజీనామా చేయవలసిందే హరీష్ రావు

ఎప్పటికైనా నువ్వు రాజీనామా చేయవలసిందే హరీష్ రావు

ఎప్పటికైనా నువ్వు రాజీనామా చేయవలసిందే హరీష్ రావు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే ఆ రాజీనామా లేఖ చెల్లదని మాజీ మంత్రి హరీష్ రావు కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మోసం చేయాలనుకునే ప్రతీసారి హరీష్ కు అమర వీరుల స్థూపం గుర్తొస్తదన్నా రు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు ఎప్పుడైనా వెళ్లారా? అని ప్రశ్నించారు.

చాంతాడంత లేఖ రాసు కొచ్చి రాజీనామా లేఖ అంటుండని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజీనామా లేఖ అలా ఉండదన్న సీఎం… హరీష్ తన మామ చెప్పిన పద్యమంతా లేఖలో రాసు కొచ్చారని విమర్శించారు.

హరీష్ రావు తెలివి ప్రదర్శి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికా ళ్లలోకి జారినట్టుందని అన్నారు. హరీష్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నా మన్నారు.

ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరు తామన్నారు. నీ రాజీనామా రెడీగా పెట్టుకోవాలని సవాల్ విసిరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button