వైద్య సేవలు పడకేయడంతో “రెఫరల్ ఆసుపత్రిగా” మారిన భువనగిరి ఏరియా ఆసుపత్రి
భువనగిరి ఏరియా ఆసుపత్రి
హైదరాబాదులో ప్రైవేట్ వైద్యం భువనగిరిలో ప్రభుత్వ వైద్యం ఇది డాక్టర్ ల అప్ అండ్ డౌన్
జిల్లా కేంద్రంలో 200 పడకల ఆసుపత్రికి బదులు కొనసాగుతున్న వంద పడకల ఆసుపత్రి ఎప్పుడు అప్ గ్రేడ్ అవును
15 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఆపరేషన్ థియేటర్ లో నామమాత్రపు ఆపరేషన్లు.
అత్యాధునిక సౌకర్యాలతో సర్జికల్ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలి.
ఐ సి యు యూనిట్ లేకపోవడంతో బూజు పడుతున్న ఖరీదైన వెంటిలేటర్లు
12 మంది సివిల్ సర్జన్ లు, మత్తు డాక్టరు స్థానికంగా ఉండాలి
.
పర్యవేక్షించే ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు హైదరాబాదులో భువనగిరి లో ఉత్సవ విగ్రహాలు.
సీ కే న్యూస్ భువనగిరి ప్రతినిధి (శ్రీలత) డిసెంబర్ 18
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు నిత్యం అప్ అండ్ డౌన్ చేయడంతో వైద్యం పడేకేస్తుంన్నది. ప్రశ్నించే ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు లేక ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యక్తుల ప్రోత్సాహంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపణలు కోల్లాలు.
ప్రైవేట్ వైద్యం ఖరీదౌతున్నాయి సందర్భాలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మారుమూల ప్రాంతాల అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భావనతో 5 నవంబర్ 1999లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి, బాలయోగిల చోరవతో వంద పడకల ఆసుపత్రిని అట్టహాసంగా ప్రారంభించారు.
వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటే హైదరాబాద్ వరకు మెరుగైన ఆసుపత్రిలో లేకపోవడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులు లేనందున ఆ రోజుల్లో స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం విశేషం.
భువనగిరి ఆసుపత్రి హైదరాబాద్ కు కూత పెట్టు దూరంలో ఉండటంతో ఈ ఆస్పత్రిలో పనిచేసే సూపరింటెండెంట్, ఆర్ ఏం ఓ లతో పాటు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు ఆరోగ్య సేవలు అందించకుండా భువనగిరిలో ఉద్యోగం.. హైదరాబాదులో ప్రైవేటు వైద్యం అన్న చందాన వారి వైద్య సేవలు కొనసాగుతున్న చర్యలు చేపట్టాలసిన ఆస్పత్రి అడ్వైజరి కమిటీ చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మొక్కుబడి ఆసుపత్రిలో సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించి స్థానికంగా ఉంటూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారా అన్న విషయంపై ఏనాడు అరా తీసి చర్యలు చేపట్టక పోవడంతో ప్రభుత్వ వైద్యంలో ప్రైవేటు వ్యక్తుల వైద్యం చోటు చేసుకోవడంతో వైద్య సేవలు కలుషితమవుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.
అంతేగాక నేటి ఆధునిక యుగంలో వైద్య పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణాన భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 15 సంవత్సరాల క్రితం నాటి పాతపరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ లోనే కొన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి తప్ప 90 శాతం రోగులకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియా ఆస్పత్రికో ఆపరేషన్లు నిర్వహించుకునేందుకు డాక్టర్లు రెఫర్ చేస్తుంటారు. అందుకే భువనగిరి ఏరియా ఆసుపత్రికి రెఫెరల్ ఆసుపత్రిగా పేరుగాంచింది.
అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఏసి సౌకర్యం కలిగిన ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేయాలని మారుమూల ప్రాంతాల నుండి ఇచ్చిన పేద ప్రజలు భవనగిరి ఎమ్మెల్యే తో డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక ప్రమాదాలలో గాయపడి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న అత్యవసర చికిత్సలు దించేందుకు ట్రామా కేర్ సెంటర్ లేకపోవటం,అన్ని రకాల ఆపరేషన్ చేసే ఆర్థోపెడిక్ డాక్టర్లు, న్యూరో సర్జన్లు, మత్తు డాక్టర్ లతో పాటు కంటి ఆపరేషన్లు చేసే సర్జన్లు లేకపోవడంతో ప్రతిరోగికి ప్రదమ చికిత్స చేసి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపడం పరిపాటిగా డ్యూటీ డాక్టర్లకు మారింది.
అంతేగాక ఈ ఆస్పత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తున్నామని, జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని రోజులకే ప్రభుత్వం మారడంతో కొత్తగా ఎన్నికైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరిలో వైద్య కళాశాలను ఏర్పాటుకు ప్రయత్నిస్తారా లేదా వేచి చూడాల్సిందే.
ఆస్పత్రిలో ప్రస్తుతం 12 మంది సివిల్ సర్జన్ డాక్టర్లతోపాటు, 24 గంటలు వైద్య సేవలు అందించే మత్తు డాక్టర్లను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన నియమించాల్సి ఉంటుంది, ముఖ్యంగా రోగులకు అత్యవసర చికిత్సలు అందించే డాక్టర్లులేక ప్రభుత్వం టెంపరరీ ప్రాతిపదికన జూనియర్ డాక్టర్లను నియమించడంతో మొక్కుబడి వైద్య సేవలు అందించి డ్యూటీ టైం కాగానే హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
అంతేగాక ఆస్పత్రి సమీపన ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ల ఏర్పాటుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనుమ తించకూడదని నిబంధనలు ఉన్న. డి ఏంహెచ్ ఓ అట్టి
నర్సింగ్ హోమ్ ఏర్పాటుకు కావలసిన నిబంధనలో ఉల్లంఘించ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కేవలం ఎస్ ఎస్ సి విద్య అర్హతలతో డిప్లమా ఇన్ పెథాలజీ, విద్యార్హతలు కలిగి ఉన్న వ్యక్తులు వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేసే నర్సింగ్ హోమ్ లలో డాక్టర్ల నియామకాలు లేకున్నా, కూత పెట్టు దూరంలో ఉన్న ప్రభుత్వ డాక్టర్లను పిలిపించుకొని వారు వైద్య సేవలతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నప్పటికీ చర్యలు చేపట్టే ఉన్నత వైద్యాధికారులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల డాక్టర్ల అన్న అనుమానం రోగులలో కలుపుతుంది.
అంతేగాక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులను ఆస్పత్రి ఉన్నత అధికారులు వారి కనుసన్నల్లో అనుమతించడంతో వారు ఆసుపత్రిలో సూపరెంటెండెంట్, తోపాటు డాక్టర్లను మంచిగా చేసుకొని దవఖానకొచ్చిన రోగులను తమ నర్సింగ్ హోమ్ లకు తరలించకపోతున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. గతంలో ఒక ప్రైవేట్ వ్యక్తి అనుమతి లేని నర్సింగ్ హోం ను నిర్వహించే వ్యక్తి ఆస్పత్రిలో సర్వం తానే అన్న భావనతో ఆపరేషన్ థియేటర్లలో కూడా వెళ్ళుతున్నాడన్న ఆరోపణలు రావడానికి అప్పటి ఎమ్మెల్యే అతనిపై చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిన విషయం కూడా తెలిసిందే.
అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులే ప్రవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అయిపోయిందని ఆరోపిస్తున్నారు.
ఏమైనా ఏమైనా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు స్థానికంగా ఉంటూ రోగులకు వైద్య సేవలు అందించే లా చర్యలు చేపట్టాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో కోరుతున్నారు.
అంతేగాక ప్రస్తుతం డిగ్రీ ఏరియా ఆసుపత్రికి 200 పడక ఆసుపత్రిగా అప్లికేట్ చేసి అందులో అత్యధిక సౌకర్యాలు కలిగి ఉన్న సర్జికల్ ఆపరేషన్ థియేటర్ నో ఏర్పాటు చేస్తే ఇక్కడనే అన్ని రకాల ఆపరేషన్‌లో జరుగుతాయన్న భావన ప్రజల్లో కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక ప్రమాదాల భారీ పడి వైద్య చికిత్స కోసం వస్తున్న రోగులకు చికిత్సలు అందించేందుకు ట్రామా కేర్ యూనిట్ ఏర్పాటుచేసి వైద్య సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు. రోగులకు తగ్గట్టు డాక్టర్ల నియామకాల కోసం, డిప్యూటేషన్ లో ఉన్న డాక్టర్ల డిప్యూటేషన్లను రద్దు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామర రాజనర్సింహకు వినతి పత్రాలను అందించిన ఉన్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జంగీర్ తెలిపారు.
ఇప్పటికైనా భువనగిరి ఏరియా ఆసుపత్రి కలియున్న రిఫరల్ ఆసుపత్రికి బదులు వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా పేరు తెచ్చుకున్న విధంగా ఆస్పత్రి ఉన్నత అధికారులు డాక్టర్లు విహరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.