మద్యం మత్తులో నడి రోడ్డు పై యువతి రచ్చరచ్చ
పొద్దున్నే తాగుతూ వాకర్స్ తో గొడవ పడిన జంట
యువత అదేదో ట్రెండ్ అన్నట్లుగా రోడ్లపైనే తాగుతున్నారు. దీంతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పొద్దున్నే తాగుతూ ఓ జంట మార్నింగ్ వాకర్స్‌తో గొడవ పడింది. హైదరాబాద్- నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం కారులో ఓ యువతీ, యువకుడు వచ్చారు. కారును రోడ్డుపై ఉంచి వారు బీర్లు తాగుతున్నారు.
అదే సమయంలో మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు గమనించి.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో జంట వారి మటలు వినకుండా వాకర్స్‌తో గొడవపడ్డారు. వాకింగ్ వచ్చే వారిలో మహిళలు, చిన్నపిల్లలు సైతం ఉన్నారు.
కానీ ఆ జంట మాత్రం సిగరెట్, బీరు తాగుతూ వారితో గొడవకు దిగారు. ఓ సీనియర్ సిటిజన్ సైతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కూడా జంట వినలేదు. దీంతో గొడవ ఎక్కువ కావడంతో అక్కడి నుంచి జంట ఉడాయించారు.
ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.