కంటేనర్ లో అక్రమంగా తరలిస్తున్న పశువులు
ఊపిరాడక నీళ్లు లేక చనిపోయిన ముగా జీవాలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మే 29
సూర్యాపేట జిల్లా నుండి పశువుల సంతలో జనగామ కు చెందిన ఓ వ్యక్తి మధ్య వర్తిగా ఉండి పశువులను కొని పంపడం జరిగింది వాటిని సత్యసాయి జిల్లా కదిరి,తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు kA 01AN 8550 కంటైనర్ వాహనంలో 26 ఎద్దులను తరలిస్తుండగా మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ వారు పట్టుకొని పంచనామా నిర్వహించారు
ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నిలుపుదల చేశారు.ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని బ్రతికి ఉన్నట్లు సమాచారం వాటిని మట్టపల్లి గోశాలలో ఉంచగా మిగిలిన బ్రతికి ఉన్న 9 ఎద్దులను నిన్న రాత్రి సుమారుగా 7 గంటల సమయంలో నల్గొండ గో శాలకు తరలించగా అక్కడ వారు సరిగా చూడక అన్ని చానిపోయాయని తెలుపగా లారీ డ్రైవర్లు మరల అర్థరాత్రి మట్టంపల్లి తీసుకు రాగ రాత్రి మొత్తం అవి అందులోనే ఉండడంతో ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఉన్న స్థానికులు కంటేనర్ ఎక్కి చూడగా 3 ఎద్దులు బ్రతికి ఉన్నట్లు సమాచారం అక్కడ నుండి మఠంపల్లి ఎస్సై విచారణ చేసి చనిపోయిన పశువులను ప్రభుత్వ పశు వైద్యులచే పంచనామా కొరకు మట్టపల్లి కృష్ణానది ఒడ్డున కంటైనర్ లో ఉన్న చనిపోయిన వాటిని ట్రాక్టర్ తో కట్టుకొని ఒక్కొక్కటి ఈ డ్చుకుంటూ కృష్ణానది వద్ద పంచనామా నిర్వహించారు.అందులో 3 కొనపిరితో ఉన్న నీరులేక ఊపిరి అడక అందులో సజీవంగా ఉన్న 3 వాటిలో 2 చనిపోవడం.జరిగింది ఏది ఏమైనా మానవత్వం లేకుండా పశువులను మూసివేసిన కంటైనర్ లో తీసుకువెళ్లడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ నుండి పశువులను తరలిస్తూన్న వారిని సమగ్ర విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారులను కోరుతున్నారు.