తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరులు త్యాగాలకు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆయన నందినగర్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నారు.
కిష్టయ్య ప్రాణ త్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి తాను అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన కిష్టయ్య కూతురు ప్రస్తుతం పీజీ చేస్తోంది. ఈ మేరకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన రూ.24 లక్షల రూపాయల చెక్కును ఇవాళ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోవాలంటూ కిష్టయ్య పిల్లలకు కేసీఆర్ సూచించారు.