సీఎం రేవంత్ రెడ్డి ఇంటిముందు మోకాళ్ళపై గురుకుల అభ్యర్థుల నిరసన, తీన్మార్ మల్లన్న అడ్డగింత!!
తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్ అభ్యర్థులు, నర్సింగ్ స్టాఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనల బాట పట్టారు. గత కొంతకాలంగా గురుకుల ఉద్యోగాలలో అవకతవకలు జరిగాయని, తాము గురుకుల బోర్డు కారణంగా నష్టపోయామని తమకు అపాయింట్మెంట్లు ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు.
తమ ఉద్యోగాల కోసం గురుకుల టీచర్ అభ్యర్థుల ధర్నా
మరోవైపు గురుకుల టీచర్లు కూడా గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు చేపట్టిన తర్వాతే కొత్తవారికి పోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో నేడు జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల టీచర్ అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు.
బోర్డు తప్పు చేస్తే శిక్ష మాకా? తీన్మార్ మల్లన్న అడ్డగింత
జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించిన గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై కూర్చుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. గురుకుల బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దు అని, న్యాయం కావాలని వారు ఆందోళన చేశారు.
నియామకాలపై సరైన నిర్ణయం తీసుకోండి
నియామక ప్రక్రియ జరగకపోవడంతో ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నియామకాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దణ్ణం పెడుతూ వేడుకున్నారు.
సీఎం రేవంత్ ఇంటి ముందు ఆందోళన
తాము కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి కూడా తీర్పు తెచ్చుకున్నామని, అయినా తమకు పోస్టింగ్ ఇవ్వడం లేదని గురుకుల టీచర్ అభ్యర్థులు వాపోయారు. ఇంతకాలం ఎన్నికల కోడ్ ఉందని సాకుగా చెప్పారని, ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభమవుతున్నా తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు.
నర్సింగ్ స్టాఫ్ కూడా ఆందోళన
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గురుకుల టీచర్ అభ్యర్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అలాగే జీతాలు రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వారిని సైతం అక్కడి నుండి పంపిస్తున్నారు
తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు (Gurukul Aspirants) మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న గురుకుల అభ్యర్థులు.. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగకపోవడంతోనే ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తద్వారా చాలా మంది నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాము కూడా కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగదీశారని, ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయని తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ నిరసన వ్యక్తంచేశారు.