నాలుగు బస్సులపై కేసు నమోదు,
రెండు బస్సులు సీజ్ చేసిన ఎం వి ఐ భద్రాచలం కిషన్ రావు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూన్ 14,
భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా డి టీ ఓ మరియు భద్రాచలం ఎం వి ఐ కిషన్ రావు గత రెండు రోజులుగా స్కూలు బస్సుల తనిఖీలు నిర్వహించారు.
బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా పత్రాలు కలిగి ఉన్నారా లేదా డ్రైవర్లు లైసెన్సు ఉందా లేదా ఇలా పలు అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 130 బస్సులు ఫిట్నెస్ కలిగి ఉన్నాయని ఇంకా కొన్ని బస్సులు రావాల్సి ఉందని తెలియజేశారు.
పిల్లలకు తీసుకువెళ్లి తీసుకువచ్చే స్కూల్ బస్సులు నిబంధనలు పాటించాలని, బస్సులకి ఫిట్నెస్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేసి బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.