రిటైర్డ్ అధికారులకు సన్మానం
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం జూన్ 28 సి కె న్యూస్
ఈ నెల 30 వ తేదీన పదవీ విరమణ చెందుతున్న పలమనేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి.విద్యాసాగర్ మరియు విస్తరణాధికారి(పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గిరిధర్ ల సేవలను కొనియాడుతూ వారికి జ్ఞాపిక లను అందజేసి దుశ్శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు ఏపీ ఎన్జీజిఓ సంఘం అధ్యక్షుడు ఆనందబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ మరియు గంగవరం మండల పరిషత్ ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఈఓఆర్డీ తిరుమల గోపాల ప్రసాద్, పరిపాలనాధికారి, వినోద, సిబ్బంది గాయత్రి, కుమార్, పంచాయతీ కార్యదర్శులు మోహన్ రాం ప్రసాద్, సురేష్, హేమలత,నీలావతి, గ్రామ వార్డు ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, వేణుగోపాల్,లత ప్రసన్న, బిందు, సుబ్రమణ్యం జయకుమార్, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.