డీసీహెచ్ఎస్ గా నియమితులైన సందర్భంగా మంత్రి పొంగులేటిని కలిసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం ఆస్పత్రుల పర్యవేక్షక అధికారి(డీసీహెచ్ఎస్)గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ గారు.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆదివారం కలిశారు.
డీసీహెచ్ఎస్ గా నియమితులైన తర్వాత హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లోని పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు..
అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సిబ్బంది నియామకాన్ని చేపట్టిన నేపథ్యంలో.. వైద్య సేవలు విస్తృతంగా అందించాలని ఆయనను ఆదేశించారు.