ఐదు రోజులైనా దొరకని వాసంతి మృతదేహం ఆచూకీ?
మృతదేహం కోసం పోలీసుల విస్తృత గాలింపు
నంద్యాల జిల్లాలోనిముచ్చు మర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వాసంతి మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నా రు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు
జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలురను ఇప్పటికే పోలీసులు అదు పులోకి తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు.
బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేసామని సదరు మైనర్ బాలురు చెప్పారు. దీంతో మొదట కాలువలో ఒక చోట పడేసామని చెప్పిన మైనర్ బాలురు.. ఆ తరువాత కాలువలో పంప్ హౌస్ సమీపంలో పడేసా మని మరోసారి చెప్పారు.
అయితే, ముచ్చుమర్రి ఎత్తి పోతల అప్రోచ్ కాలువలో 9వ తేది సాయంత్రం నుంచి బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. ఆధునిక కెమె రాలు నీటిలోకి పంపి గాలించిన సిబ్బంది.. అయి నా చిన్నారి మృతదేహం జాడ దొరకలేదు.
అయితే, మరోవైపు బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. అదృశ్యమైన వాసంతిని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనుక్కోలేక పోయారని వాసంతి తల్లి దండ్రులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగేంత వరకు రోడ్డుపై ధర్నా విర మించే లేదని వాసంతి తల్లిదండ్రులు చెబుతు న్నారు.మూడు రోజులుగా స్థానిక మత్స్యకారులు వలలతో గాలిస్తున్నారు. మరోవైపు గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టా రు.
ఇప్పటి వరకు వాసంతి బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో ఈరోజు గాలింపు చర్యలు చేపట్టారు..
నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం…