మహిళలకు శుభవార్త… భారీగా తగ్గిన బంగారం ధరలు
Web desc : నిన్నా, మొన్నటి వరకు బంగారం ధరలను చూసి కొనుగోలు దారులు బంబేలెత్తిపోయారు. ఏడాది కిందట రూ.50 నుంచి రూ.60 వేలు పలికిన ఈ ధరలు రూ.80 వేలు పైకి చేరింది.ఆ తరువాత లక్ష వరకు చేరుకుంటుందన్న చర్చ సాగింది.
కానీ ఒక్కసారి బంగారం ధరలు దిగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో బంగారం ధరలు తగ్గు వస్తున్నాయి. అప్పటి నుంచి భారీగా బంగారం ధరలు కిందికి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బంగారం కొనుగోలు చేయడానికి ముందు వెనుకా ఆలోచించిన వారు ఇప్పుడు పసిడి కోనుగోలు చేయడానికి సరైన సమయం అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం. ఇప్పుడు పెద్దగా శుభకార్యాలు లేవు. కానీ వచ్చేది శ్రావణ మాసం. ఈ మాసంలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా శ్రావణ శుభ ప్రదంగా బంగారం వినియోగించే అవకాశం ఉంది. ఈ నెలలో వ్రతాలు, పూజలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బంగారం ధరించాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
అయితే ప్రస్తుతం బంగారం ధరలు తక్కువగా ఉండడంతో పసిడి కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని అంటున్నారు. కొన్ని రోజులుగా అందనంత ఎత్తులో పెరిగిన బంగారం ధరలు వరుసగా.. భారీ స్థాయిలో తగ్గాయి. ఇంతకీ బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? హైదరాబాద్ లో తులం రేటు ఎంత? వివరాల్లోకి వెళ్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం ధరలు జూలై 25న 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 65,090తో విక్రయిస్తున్నారు.
24 క్యారెట్లు రూ.71,000 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,150, . 24 క్యారెట్లు రూ.69,950గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,100, . 24 క్యారెట్లు రూ.69,820గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,100, . 24 క్యారెట్లు రూ.69,820గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,300, . 24 క్యారెట్లు రూ.70,150గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,000, . 24 క్యారెట్లు రూ.69,820గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,000, . 24 క్యారెట్లు రూ.69,820గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,920, . 24 క్యారెట్లు రూ.70,850గా ఉంది. విశాఖ పట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,940, . 24 క్యారెట్లు రూ.70,850గా కొనసాగుతోంది.
గత కొన్నిరోజులగా బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి. ఇవే బంగారం ధరలు జూన్ 24న 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,950, . 24 క్యారెట్లు రూ.70,860 గా ఉన్నాయి. 23న 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,950, . 24 క్యారెట్లు రూ.70,860 గా ఉన్నాయి.
24వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,950, . 24 క్యారెట్లు రూ.70,860గా ఉన్నాయి. 22న 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 67,770, . 24 క్యారెట్లు రూ.73,850 గా ఉన్నాయి. ఇక జూలై 16న 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 67,850, . 24 క్యారెట్లు రూ.74,020 గా ఉన్నాయి.
జూలై 16 నుంచి ఇప్పటి వరకు చూస్తే బంగారం ధరల్లో దాదాపు రూ.6 వేల వరకు తగ్గుతూ వస్తోంది. ఇది పెట్టుబడి దారులకు కొంచెం కష్టం ఉన్నా.. కొనుగోలు దారులకు మాత్రం మంచి సమయం అంటున్నారు.