
రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ముగ్గురు కోర్టు సిబ్బంది పట్టుబడ్డారు.
పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డ వారిలో ఉన్నారు. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా ఒకరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు.
ఎసిబికి చిక్కిన అవినీతి మరో అవినీతి తిమింగలం…
ఎసిబి దాడిలో మంథని సబ్ రిజిస్ట్రార్ అడ్డంగా బుక్కయ్యారు.
శుక్రవారం మంథని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి డిఎస్‌పి మధు ఆధ్వర్యంలోకార్యాలయంపై దాడులు నిర్వహించగా సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి ఓ రైతు వద్ద రూ.16,500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపుకు చెందిన ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేయగా ఏసీబీ పక్కా ప్రణాళికతో రైతు సహకారంతో కార్యాలయంపై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అధికారులు లంచం డిమాండ్ చేయకూడదని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఎసిబి సహకారం పొందవచ్చని వారు తెలిపారు. ఎసిబి దాడితో మంథని ఒక్కసారిగా ఉలిక్కిపడింది.




