పాలేరు నియోజకవర్గ నిరుద్యోగులకు పొంగులేటి శీనన్న కానుక
- గ్రూప్ 2,3, ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
- రైట్ ఛాయిస్ అకాడమీ కిరణ్ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంప్
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి : పాలేరు నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న గ్రామీణ నిరుద్యోగులకు తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు.
రాష్ట్రంలో పోటీపరీక్షలకు అత్యున్నత శిక్షణా సంస్థ రైట్ ఛాయిస్ అకాడమీ సహకారంతో త్వరలో జరగనున్న గ్రూప్2,3 పరీక్షలతో పాటు రాబోయే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన గోడపత్రికను కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మంత్రి విడుదల చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగులంతా.. ఈ శిక్షణా శిబిరాన్ని ఉపయోగించుకొని తమ కలల ఉద్యోగాన్ని సాధించేందుకు కృషిచేయాలని పొంగులేటి ఆకాంక్షించారు.
గతంలో కూడా తాను ఎంపీగా ఉన్న సమయంలో రైట్ ఛాయిస్ అకాడమీ కిరణ్ సహకారంతో ఏర్పాటు చేసిన కోచింగ్ క్యాంప్ లో వందలాదిమంది ఉద్యోగాలు సాధించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఫ్యాకల్టీల సహకారంతో పోటీ పరీక్షల శిక్షణతో పాటు, మాక్ టెస్టులు, ఉచిత స్టడీ మెటీరియల్ ను ఈ శిక్షణా శిబిరంలో అందించనున్నట్లు తెలిపారు.
పాలేరు నియోజవకర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న వారంతా.. ఆగస్ట్ 9లోపు అభ్యర్థి పేరు, గ్రామం, మండలం వివరాలను 8985096699 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో పంపాలని మెండెం కిరణ్ కోరారు.
వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని గ్రామీణ విద్యార్థుల కోసం మంత్రి పొంగులేటి ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోనే.. నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్న మొదటి ప్రజాప్రతినిధి పొంగులేటి శీనన్న కావడం విశేషం.