వాళ్ల టార్చర్ భరించలేను.. నాకు చావే శరణ్యం : శ్రీరెడ్డి సూసైడ్ నోట్
Web desc : కోన్నాళ్ల క్రితం టాలీవుడ్లో మీ టూ ఉద్యమం, హీరోయిన్ల క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో ఒక ఊపు ఊపింది శ్రీరెడ్డి.
కొందరు సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని లోబరచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అక్కడితో ఆగకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేసి నానారాద్ధాంతం చేసింది. ఈ పరిణామాలతో శ్రీరెడ్డి రాత్రికి రాత్రి సెన్సేషనల్ స్టార్ అయ్యింది.
శ్రీరెడ్డి నెక ట్స్ టార్గెట్ ఎవరు, తెల్లారితే ఎవరి గురించి చెబుతుందోనని జనం, మీడియా ఉత్కంఠగా ఎదురుచూశారు. అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేవారు. శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్స్ నడిపించాయి ఛానెళ్లు.
తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకే హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్లు ఇవ్వాలని చెప్పి శ్రీరెడ్డి బాగానే పోరాడింది. సినీ ప్రముఖులన కాదు.. రాజకీయ నాయకులను కూడా ఆమె వదల్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి.
కానీ కాలం గడిచేకొద్దీ శ్రీరెడ్డిని జనం మరిచిపోయారు. ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు వదులుతూనే ఉంది. అయినా ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరి స్టైల్లో వేష భాషలు మార్చి వంటల వీడియ లు పెట్టేది. రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్ధతుగా మాట్లాడుతూ ఉండేది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది.
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్సార్సీపీని టార్గెట్ చేసిన వాళ్లలో ఎవరినీ వదలొద్దు .. జగనన్నా అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు.. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీ, జనసేనలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది.
తీరా కూటమికి పవర్ దక్కడంతో ఆమెకు మింగుడుపడటం లేదు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ త లుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రస్తుతం తన మానసిక పరిస్ధితి ఏమాత్రం బాలేదని.. తనను ఏమైనా చేస్తారేమోననో భయంతో శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది.
తాను మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యానని, నన్ను ఇక ఆ భద్రకాళీ అమ్మవారే కాపాడాలి. నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే లోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం. ఇంకా ఎన్నిరోజులు బతుకుతానో తెలియదు,
ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా అనిపించవచ్చు.. కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉంది అని శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.