డెంగ్యూ, మలేరియా జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
పలమనేర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ మమతా రాణి
పలమనేరు, ఆగస్టు 2, సి కె న్యూస్
మలేరియా, డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ మరియు చిన్న పిల్లల డాక్టర్ మమతా రాణి తెలియజేశారు.
వర్షాకాలం దోమల ప్రభావంతో, డెంగ్యూ మలేరియా వస్తుందని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రజలకు అవేర్నెస్ కల్పించారు.
జ్వరం వస్తూనే.. మంచి పట్టభద్రుడైన డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోవాలని, అక్కడ, ఇక్కడ చూపించి, తీరా జ్వరం ముదిరిపోయిన తర్వాత వస్తే, కష్టమవుతుందని, డెంగ్యూ ఉన్నట్లయితే, ప్లేట్లెట్స్ మానిటరింగ్ చేసుకుంటూ… చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా మమత రాణి తెలియజేశారు.
పలమనేర్ ఏరియా హాస్పిటల్ నందు యాంటీ స్నేక్ వినం మెడిసిన్ అందుబాటులో ఉందని, పాము కరిచిన వెంటనే హాస్పిటల్కు తీసుకురావాలని, అలా కాక నాటు వైద్యాలు, చిన్నాచితక డాక్టర్ దగ్గర చూపించడం వల్ల ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ చేశారు.