అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్
పలమనేరు నియోజకవర్గం ,ఆగస్టు16, సీకే న్యూస్
పలమనేరు లో,ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా, అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది.
ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ. .. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను, పునః ప్రారంభించడం జరిగిందని, గత ప్రభుత్వం పేదవారికి పెట్టే భోజనాన్ని లాక్కుందని, చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని,
ఎన్టీఆర్ ఆశయసాధనకు అనుగుణంగా, పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా, తెలుగుదేశం ప్రభుత్వం, అన్నా క్యాంటీలను పునః ప్రారంభించిందని, ఈ సందర్భంగా అమర్ నాథ్ రెడ్డి తెలియజేశారు.
గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న క్యాంటీన్ మూసివేస్తే, ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెండు సంవత్సరాలు దాతల సహకారంతో, తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ…. తమిళనాడు గవర్నమెంటును చూసి మనం నేర్చుకోవాలని, డిఎంకె, ఏడీఎంకే ఏ పార్టీ ఉన్నా అమ్మ క్యాంటీన్ లను నిర్వహిస్తున్నారు అని ఈ క్యాంటీన్లు ఎల్లవేళలా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని తెలియజేశారు.
ఈరోజు ఈ అన్న క్యాంటీన్లో, బ్రేక్ ఫాస్ట్ ఉచితంగానే నాగరాజు, ఖాజాపీర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగిందని ఆయన తెలియజేశారు. పంజాణి ఎక్స్ ఎంపీటీసీ చెంగారెడ్డి ఈరోజు 20 వేల రూపాయలు అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు.
ప్రతిరోజు వెయ్యి మందికి ఈ క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.