సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్.. కొండా సురేఖ సంచలన ఆరోపణ
నాగచైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్‌గా మారింది. నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
హీరో హీరోయిన్ల ప్యాన్ ట్యాపింగ్ చేసింది కేటీఆరే అన్నారు. అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా ఆయనే అంటూ మండిపడ్డారు. వాళ్ల జీవితాలతో ఆడుకొని.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మాారాయి. నిన్నమొన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే.. ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. వీరిద్దరు విడాకులు తీసుకొని కూడా మూడేళ్లు గడుస్తున్న సామ్ చైతు విడాకులు వార్త మాత్రం ఎవర్నీ వదలడం లేదు. దీనికి తోడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడం.. అదీకూడా మరో టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వడం.. ఇప్పుడు మరింత చర్చనీయాంశం అయ్యింది.
వెంట్రుక కూడా పీకలేవు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
మరోవైపు కొండా సురేఖ్ చేసిన కామెంట్లపై కేటీఆర్ వెంటనే స్పందించారు. నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా అన్నారు. కొండా సురేఖ నాపై ఏడుస్తున్నారన్నారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో మమ్మల్ని లాగుతున్నారన్నారు కేటీఆర్.
ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా సమంతను ప్రేమించి 2017లో పెళ్లాడాడు నాగ చైతన్య. అయితే వారి మధ్య కొన్ని కారణాల వల్ల సమంతతో 2021లో విడాకులు తీసుకోగా ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ విషయాన్నీ మర్చిపోతుండగా.. నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్ధం అవ్వడంతో నెటిజన్స్ సమంతను, నాగ చైతన్యను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. నాగ చైతన్యదే తప్పు అంటూ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు కొండా సురేఖ వచ్చి నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అనడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు. కేటీఆర్ ఆ విషయంతో సంబంధం లేని వ్యవహారం అన్నప్పటికీ కొండా సురేఖ కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.