పాల్వంచలో ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అక్టోబర్ 24,
పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన నాగరాజు నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు ఇటీవల నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, ఇంటికి కరెంటు మీటర్ లేదని, దొంగ కరెంటు వాడుతున్నందుకు కరెంటు కేసు అవుతుందని 68,000/- డిమాండ్ చేశాడు.
బుధవారం ఉదయం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 26, 000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.