బాలికపై సీఐ అత్యాచారయత్నం…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ సీఐ(CI) అత్యాచారయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బుధవారం రోజున ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానిక రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.