EntertainmentHyderabadPoliticalTelangana

అల్లు అర్జున్ అరెస్ట్...?

అల్లు అర్జున్ అరెస్ట్...?

అల్లు అర్జున్ అరెస్ట్…

TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది.

ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో (Police Case On Allu Arjun) అల్లు అర్జున్‌ను నిందితుల్లో ఒకరిగా గుర్తించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. బన్నిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

సంధ్య థియేటర్‌ వద్ద అసలేం ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబరు 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 4న (బుధవారం) వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ ఇటీవల వెల్లడించారు. ”బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా.. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు”

”రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్‌ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button