మూడు లక్షలు విలువగల ఎండు గంజాయి స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, బృందం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
డిసెంబర్ 15,
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఖమ్మం బృందం భద్రాచలం వద్ద రూట్ వాచ్ మరియు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
కుంట నుండి నాందేడ్‌కు రవాణా చేసేటప్పుడు ఎండు గంజాయి కేసును గుర్తించారు. ఎండు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఏ1 వెట్టి కేశ, నివాసం గోండ్ పల్లి, కుంట, ఏ2 మడ్కం ముయ్య, నివాసం మరియగూడ, కుంటని అరెస్టు చేశారు.
4.730 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు మూడు లక్షలు రూపాయలు ఉంటుంది తెలిపారు. వారి వద్ద నుండి 1 ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎస్ హెచ్ ఓకు అప్పగించారు. తనిఖీల్లో రమేష్, బాలు హెచ్ సి, సుధీర్, వెంకట్, విజయ్ పాల్గొన్నారు. రైడ్ బృందాన్ని ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గౌడ్ అభినందించారు.