అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాల సంఘాల నేతల అరెస్ట్
ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం పై మాల సంఘాల నాయకులు అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే మాల నాయకులు ఇవాళ సీఎం డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.ఈ క్రమంలోనే మాల నాయకులు ఇవాళ సీఎం డౌన్.. డౌన్ అంటూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
అసెంబ్లీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగిన మాల మహానాడు నాయకులు చెన్నయ్య, రామచందర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.
ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ అమలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాల సంఘాలు గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేశారు.