
వాలంటైన్స్ వీక్లో విషాదం.. సిద్ధిపేటలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం..!
ఈ మధ్య కాలంలో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతూ వస్తున్నాయి. స్ట్రెస్, ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
తాజాగా సిద్దిపేట పెద్దలింగారెడ్డి శివారులో కూడా దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వాలెంటైన్స్ వీక్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరేమోనని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకరాం.. శ్రవణ్ (24) ఇంటర్ పూర్తి చేసి జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక చిన్నకోడూరు మండలంలోని గ్రామానికి చెందిన కల్పన( 17) లు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కల్పన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు నిన్న ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు.
ఇంటి నుంచి ఉదయం బయలుదేరి ఎంతకీ తిరిగి రాలేదు. రాత్రి 7 గంటల సమయంలో పెద్ద లింగారెడ్డి శివారులో ఇద్దరు ఉరేసుకొని వేలాడుతూ కనిపించారు. స్థానికులు సమాచారంతో సిద్ధిపేటలో కలకలం రేపింది.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబాలకు వెంటనే సమాచారం కూడా అందించారు. అయితే వారి వద్ద ఆధార్ కార్డు, బుక్స్, ఒక చీర కూడా కల్పన బ్యాగ్లో లభించింది.
అయితే ఆనవాళ్లు చూస్తుంటే వారి పెళ్లికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. అయితే పెద్దలు అంగీకరించారని తీవ్ర మనస్థాపానికి గురై వారు ఈ దారుణ ఘటనకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
అయితే, స్థానికుల ప్రకారం వీరు ఇద్దరు దూరపు బంధువులే అవుతారు. వీరి మధ్య ఆ బంధం ప్రేమకు దారితీసింది. కానీ, తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు అని, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోకుండా అని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇది ఇలా ఉండగా కల్పనకు పెళ్లి కాని ఒక అక్క కూడా ఉంది. అది కూడా కారణమవ్వచ్చని స్థానికులు అంటున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు డెడ్ బాడీలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆత్మహత్యకు సంబంధించిన అసలు కారణం మాత్రం బయటికి రావాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




