PoliticalTelangana

తెలంగాణ కాంగ్రెస్‌కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ

తెలంగాణ కాంగ్రెస్‌కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ

తెలంగాణ కాంగ్రెస్‌కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో 5 కమిటీలను ఏర్పాటు చేసింది. 22 మందితో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పొలిటికల్ అఫైర్స్​ కమిటీ), 15 మందితో కూడిన సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్‌ కమిటీ, 16 మందితో సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీలను నియమిస్తూ గురువారం రాత్రి ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నది వీళ్లే: మీనాక్షి నటరాజన్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌ రెడ్డి, జి.రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, డి. శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీతో పాటు అజహరుద్దీన్‌, ఆది శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌, బీర్ల ఐలయ్య, పి.సుదర్శన్‌ రెడ్డి, కె.ప్రేమ్‌సాగర్‌ రావు, జెట్టి కుసుమ్‌ కుమార్‌, ఎరవర్తి అనిల్‌ కుమార్‌ ఉన్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ మంత్రులు ఉంటారు.

అడ్వైజరీ కమిటీ : మీనాక్షి నటరాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వీహెచ్​( వి.హనుమంతరావు), జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌, జి.చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జయప్రకాశ్‌ రెడ్డి, జాఫర్‌ జావేద్‌, టి. జీవన్‌ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్‌

డీలిమిటేషన్‌ కమిటీ : ఈ డీలిమిటేషన్ కమిటీలో చల్లా వంశీచంద్ రెడ్డి (ఛైర్మన్‌), గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, డా. శ్రవణ్‌ కుమార్ రెడ్డి, పవన్‌ మల్లాది, డి.వెంకటరమణల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.

సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ : పి. వినయ్‌ కుమార్‌ (ఛైర్మన్‌), అద్దంకి దయాకర్‌, కె.శంకరయ్య, ఎన్‌.బాలు నాయక్‌, ఎ.నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమళ్ల సిద్ధేశ్వర్‌, సంతోష్‌ కొలకొండ, డా.పులి అనిల్‌ కుమార్‌, జూలూరి ధనలక్ష్మి, మజీద్‌ ఖాన్‌, జి.రాములు, అర్జున్‌ రావు, శౌరి, కొల్లం వల్లభ్‌ రెడ్డి, వి.శ్రీకాంత్‌ రెడ్డిలు సంవిధాన్​ బచావో ప్రోగ్రామ్ కమిటీలో ఉంటారు.

డిసిప్లినరీ యాక్షన్ కమిటీ : మల్లు రవి (ఛైర్మన్‌), ఎ.శ్యామ్‌ మోహన్‌ (వైస్‌ ఛైర్మన్‌), ఎం.నిరంజన్‌ రెడ్డి, బి.కమలాకర్‌రావు, జాఫర్‌ జావేద్‌, డా.జీవీ రామకృష్ణల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button