PoliticalTelangana

ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు

ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు

ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు

Social media viral : బెంగళూరులో ఓ ఆటోడ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని పాంఖురీ మిశ్రాగా గుర్తించారు.
ఆమె ఆటోడ్రైవర్‌ను దారుణంగా అవమానించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె కటకటాల పాలైంది.

శనివారం నాడు పాంఖురీ తన భర్తతో కలిసి టూ వీలర్‌పై వెళ్తుండగా.. ఆటో డ్రైవర్‌ లోకేశ్‌తో వివాదం తలెత్తింది. లోకేశ్ తన కాలి పైనుంచి ఆటో పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని డ్రైవర్ లోకేశ్ వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే పాంఖురీ వెంటనే అతడిని చెప్పుతో కొట్టింది.

‘వీడియో రికార్డు చేస్తావా నువ్వు.. చెయ్ రికార్డు చెయ్’ అంటూ ఆమె అనడం సైతం వీడియోలో రికార్డయ్యింది.స్కూటీ పక్కనే ఒక ఆటో వెళుతుండగా.. ఆటో టైర్ తన కాలిపై నుంచి వెళ్లిందని మిశ్రా అనే మహిళ ఆటో డ్రైవర్తో గొడవ పెట్టుకుంది.

వాస్తవానికి.. ఆటో వీళ్ల పక్క నుంచి వెళ్లిందే తప్ప ఆమె కాలికి ఎలాంటి గాయం కాలేదు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ లోకేష్తో ఆ మహిళ, ఆమె భర్త వాగ్వాదానికి దిగారు. సదరు మహిళ పంఖురి మిశ్రా నడిరోడ్డుపై పెద్ద సీనే చేసింది. ఆటో డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ దృశ్యాలను ఆమె భర్త వీడియో తీశాడు.

రోడ్ రేజ్ ఘటనను కాస్తా మహిళతో అసభ్య ప్రవర్తన ఘటనగా పంఖురి మిశ్రా మార్చే ప్రయత్నం చేసింది. ఆటో డ్రైవర్ను హిందీలో బూతులు తిడుతూ, ఒకటికి రెండు సార్లు అతనిని చెప్పుతో కొట్టి నానా రచ్చ చేసింది. అయితే.. ఆ ఆటో డ్రైవర్ జరిగిందంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది.

ఈ ఘటనపై ఆటో డ్రైవర్ లోకేష్ మాట్లాడుతూ.. మిశ్రా అనే మహిళ తనతో కన్నడలో కాకుండా తనకు ఏమాత్రం అర్థం కాని హిందీలో మాట్లాడిందని.. అందుకే వీడియో తీశానని చెప్పుకొచ్చాడు.

ఈ గొడవ జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ లోకేష్ తనను చెప్పుతో కొట్టిన మిశ్రాపై బెల్లందుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిశ్రా స్వస్థలం బీహార్. బెంగళూరులో ఆమె తన భర్తతో కలిసి ఉంటోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, కన్నడిగులు ఆ మహిళ ప్రవర్తనపై భగ్గుమనడంతో ఈ కేసు బెంగళూరులో హాట్ టాపిక్ అయింది. అయితే.. ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. మిశ్రా, ఆమె భర్త ఆటో డ్రైవర్తో రాజీకొచ్చారు. పంఖురి మిశ్రా, ఆమె భర్త ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు.

తాను గర్భవతినని, తనకు ఏదైనా జరిగితే గర్భం కోల్పోతాననే కంగారులో అలా చేశానే తప్ప ఆటో డ్రైవర్లపై తనకు ఎలాంటి ద్వేషం లేదని పంఖురి మిశ్రా చెప్పుకొచ్చింది. బెంగళూరు అన్నా, బెంగళూరు కల్చర్ అన్నా.. కన్నడ ప్రజలు చూపించే ప్రేమాభిమానాలన్నా తమకు ఎనలేని గౌరవం అని పంఖురి మిశ్రా ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడంతో ఈ కథ సుఖాంతమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button