HyderabadPoliticalTelangana

కవిత చెప్పింది నిజమే.. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కవిత చెప్పింది నిజమే.. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కవిత చెప్పింది నిజమే.. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది: వినోద్‌కుమార్‌

బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్లే డిసైడ్ చేస్తరు

ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్లు కుమ్మక్కయ్యారు

ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంట్​

పెద్ద ప్యాకేజీలు ఇస్తే మా నేతలు బీఆర్‌ఎస్ లో కలిసిపోతారంటూ బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడింది నిజమేనని అన్నారు.

కవిత వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్‌ తన సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. . పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎ్‌సతో కలిసిపోతారని అన్నారు. ఒక వేళ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో మావాళ్లు ఎక్కడ నుంచి పోటీ చేయాలో బీఆర్‌ఎస్‌ వాళ్లే నిర్ణయిస్తారని రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇదే జరిగిందని, దానివల్లే బీజేపీ నష్టపోయిందని చెప్పారు.

తమ నాయకులు కుమ్మక్కువుతుండడం వల్లే ప్రతీ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయిందని, లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచన చేయాలని కోరారు. ఇతర పార్టీలతో తమ నేతలు కుమ్మక్కవ్వడం వల్ల బీజేపీ చాలా నష్టపోయిందని ఆరోపించారు.

పార్టీ కార్యకర్తలకూ ఈ విషయం తెలుసునని, ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే సస్పెండ్‌ చేస్తారనే భయంతో అంతా నోరు మూసుకుని ఉంటున్నారని తెలిపారు. కాగా, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీ కాదని ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌ అన్నారు.

బీఆర్‌ ఎస్ ను, బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణపై ఆయన స్పందిస్తూ, బీజేపీ ప్రజాస్వామిక పార్టీ అని, స్ట్రెయిట్‌ ఫైట్‌ చేస్తుంది తప్ప, స్ట్రీట్‌ఫైట్‌ చేయదు అని స్పష్టం చేశారు.

కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్‌ అయితే, దానిని సీఎం రేవంత్‌ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

బాధ్యతాయుత ఎంపీగా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటుచేసిన విచారణ కమిషన్‌ ఎదుట హాజరవుతానని ఈటల తెలిపారు. ఇక, కేసీఆర్‌ కూతురు కాంగ్రె్‌సలోకి వెళుతుందని, కుమారుడు బీజేపీలోకి వస్తున్నాడని ఫోన్లు వస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌, కాళేశ్వరం కుంభకోణాలు చేసిన వారికి బీజేపీలోకి ప్రవేశం లేదని చెప్పారు. కేసీఆర్‌ కుమారుడు వస్తే.. బీజేపీ గేటు బయట కాళ్లూ చేతులు విరగ్గొట్టి పంపిస్తామన్నారు. వికారాబాద్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటామని, పార్టీలో తనవారంటూ ఎవరూ లేరన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button