నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ
నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ;
నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ
ప్రముఖ నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్ లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ముంబై లోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంజ్ జారీ చేశారు. సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లుథియానాకు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ ను సాక్షిగా పేర్కొన్నారు. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరవ్వలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్బంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.
తెలుగుతోపాటు బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్..కోవిడ్ సమయంలో తన దాత్రుత్వంతో చాలా మందిని ఆదుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి.