ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్
బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఓ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి రన్ వే నుంచి పక్కకు ఒరిగిపోయింది
ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్ వే ను చీల్చుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. దీంతో రన్ వే దెబ్బతింది.
ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ల్యాండ్ అవుతూ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పాడైన రన్ వేను ప్రస్తుతం అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బేగంపేట విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లు సమాచారం.