పని ఒత్తిడితో ఏఈ ఆత్మహత్యాయత్నం

పని ఒత్తిడితో ఏఈ ఆత్మహత్యాయత్నం;

By :  Ck News Tv
Update: 2025-03-08 06:24 GMT

పని ఒత్తిడితో ఏఈ ఆత్మహత్యాయత్నం..


పని ఒత్తిడి భరించలేక ఓ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం..

హైదరాబాద్‌లోని ప ద్మారావునగర్‌కు చెందిన శ్రీకాంత్‌.. మూడేండ్లుగా బాన్సువాడ డివిజన్‌లో ని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఏఈగా పని చేస్తున్నాడు. శ్రీకాంత్‌కు ఇటీవలే ఇద్దరు కవలలు జన్మించగా, రూ.50 లక్షల దాకా ఖర్చయింది.

Full Viewమూడేండ్లుగా కుటుంబానికి దూరం గా ఉండడం, డిప్యుటేషన్‌ను కొనసాగిస్తుండడం, పని ఒత్తిడి పెరగడంతో శ్రీకాంత్‌ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం దేశాయిపేట్‌కు వెళ్లి పురుగులమందు తాగాడు.

బాన్సువాడకు వచ్చి పురుగుల మందు తాగిన విషయాన్ని మేనత్త సుశీలతో చెప్పాడు. ఆమె స్థానికుల సాయంతో దవాఖానకు తరలించగా ప్రాణహాని లేదని వై ద్యులు తెలిపారు.

శ్రీకాంత్‌ను ఉన్నతాధికారులు పరామర్శించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డిప్యుటేషన్‌ను మార్చుతామని చెప్పారు.

Similar News