అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మహిళ మృతి

అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మహిళ మృతి;

By :  Ck News Tv
Update: 2025-03-19 12:18 GMT


అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మహిళ మృతి

అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నెలలు నిండిన గర్భిణి మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన కల్వకుర్తిలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరిన ఓ మహిళకు ఎమర్జెన్సీ నిమిత్తం హైదరాబాద్‌కు డాక్టర్లు రిఫర్ చేశారు.

అయితే, ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా 25 నిమిషాల ఆలస్యంగా వచ్చింది.అప్పటికే అంబులెన్స్ రాక ఆలస్యం కావడం.. దీనికి తోడు తాను ఇప్పుడు రాలేనంటూ డ్రైవర్ చెప్పడంతో మరింత ఆలస్యమైంది.

పరిస్థితి బాలేక అవస్థలు పడుతున్న గర్భిణీ మహిళను ఆలస్యంగా హైదరాబాద్ తీసుకెళ్లగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Similar News