గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి!

గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి!;

By :  Ck News Tv
Update: 2025-03-15 11:16 GMT

గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్:మార్చి 15

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు కొనసాగు తున్నాయి. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అని.. గాంధీ భవన్ లో మాట్లాడినట్టు ఉంది అని బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారా..? అజ్ఞానమే.. తన విజ్ఞానం అనుకుంటున్నారు అని బీఆర్ఎస్ ను ఎద్దేవా చేశారు..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన స్పీచ్ నే గవర్నర్ ప్రసంగిస్తారని సీఎం తెలి పారు.

రాష్ట్రపతి ప్రసంగం కూడా కేంద్ర కేబినెట్ ఆమో దించిన స్పీచ్ మాత్రమే చదువుతారని గుర్తుచేశారు.

ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మేము మేనిఫెస్టో ఇచ్చాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వచ్చాం. మా పార్టీ నిర్ణయాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి.

మా ప్రభుత్వ విధానాన్నే గవర్నర్ చెప్తారు. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు పదేళ్లు మంత్రులుగా చేసినం అని చెప్పుకోవడాని కి అనర్హులు అంటూ సీఎం రేవంత్ చురకలంటించారు.

బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్ అన్నా.. మహిళలు అన్నా గౌరవం లేదు అని మండి పడ్డారు. బీఆర్ఎస్ చేసిన తప్పులు మా ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. అబద్దాల ప్రతిపాదన మీద కాదు.. వాస్తవాల మీద ప్రభుత్వం నడపాలని చూస్తున్నాం అని సీఎం రేవంత్ వెల్లడించారు.

ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎన్నికలు వచ్చినప్పుడే అకౌంట్ లో రైతు బంధు డబ్బులు వేసేవారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

కోకపేట భూములు అమ్మి 2023 లో అసలు రైతు బంధు వేయలేదు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు మేము వేశామని సీఎం రేవంత్ తెలిపారు.

Similar News