హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO)
హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO);
By : Ck News Tv
Update: 2025-03-24 07:36 GMT
హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య
హైదరాబాద్ చంపాపేట పరిధి అంబేద్కర్ వాడలో ఓ న్యాయవాది హత్యకు గురయ్యారు. సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ బైక్పై వెళ్తుండగా దుండగుడు కత్తులతో దాడి చేశాడు.
గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడు ఎలక్ట్రీషియన్ దస్తగిరిగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.