HCU విద్యార్థులపై లాఠీఛార్జ్.. NHRCలో కంప్లైంట్

HCU విద్యార్థులపై లాఠీఛార్జ్.. NHRCలో కంప్లైంట్;

By :  Ck News Tv
Update: 2025-03-31 04:32 GMT

HCU విద్యార్థులపై లాఠీఛార్జ్.. NHRCలో కంప్లైంట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీలో గుంట నక్కల వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో విద్యార్థులపై గచ్చిబౌలి సీఐ విచక్షణ రహీతంగా లాఠీచార్జ్‌కు పాల్పడ్డారని న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Full View

ఆదివారం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్వరమే ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ జరిపి బ్యాధులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల దాడిలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, కొంతమంది విద్యార్థులు మూర్ఛపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో విద్యార్థులు శాంతియుత ఉద్యమాలలో పాల్గొన్నారని ప్రస్తుతం పోలీసులు వ్యవహరించిన తీరు కలవరపాటుకు గురి చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులపై చర్యలు తీసుకునే అంశంలో పోలీసులు ఇకనైనా తీరు మార్చుకోవాలని తెలిపారు

Similar News