కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?;
కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి సస్సెండ్ అయిన ఎమ్మెల్సీ మల్లన్న బీఆర్ఎస్ నేతలను కలవడం చర్చనీయాంశం అయ్యింది.
బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇకపోతే అసెంబ్లీలో 2 చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో.. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టారు.
ఈ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిసినట్లు తెలుస్తోంది.
బీసీ కులగణను వ్యతిరేకించిన మల్లన్న
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వేపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.కుల గణనపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కులగణన నివేదికలను తన యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో కాల్చివేశారు.
అలాగే బీసీలంతా కులగణన పత్రాలను తగలబెట్టాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఓ సామాజిక వర్గంపైనా తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలను కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తీన్మార్ మల్లన్న బీసీలను ఏకం చేస్తూ.. వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతను తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్నకుబీఆర్ఎస్ పరోక్ష మద్దతు
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ పరోక్షంగా మద్దత ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌కు సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు తీన్మార్ మల్లన్న పక్కన దర్శనమివ్వడంతో బీఆర్ఎస్ మద్దతు తీన్మార్ మల్లన్నకు ఉంది అని ప్రచారం ఉంది.
మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే గురించి పదేపదే ప్రస్తావించడమేనని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన బీసీల కులగణన సర్వే సరిగా జరగలేదని...కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే బాగా జరిగిందని తీన్మార్ మల్లన్న పొగడ్తల వర్షం కురిపించారు.
అప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తుంది. అంతేకాదు కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తోంది. బీసీ కులగణన సర్వేను ప్రశ్నిస్తే ఎమ్మెల్సీని పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారు? అంటూ కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ నిలదీస్తున్న సంగతి తెలిసిందే.