సరైన వైద్యం అందక వ్యక్తి మృతి

సరైన వైద్యం అందక వ్యక్తి మృతి;

By :  Ck News Tv
Update: 2025-03-19 08:27 GMT


సరైన వైద్యం అందక వ్యక్తి మృతి

చైతన్య పురి : ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం మూలంగా వైద్యం కోసం వెళ్లే అమాయకుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

డాక్టర్ పట్టా లేని వైద్యులతో ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.ఆస్పత్రి ఏర్పాటులో కనీస ప్రమాణాలు పాటించకుండా పుట్టగొడుగులు లాగా నెలకొల్పుతూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి.

అనుభవం లేని పట్టాలేని డాక్టర్ల వైద్యం వలన ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ వైద్యం చేయాలో తెలియక ప్రాణాలు తీస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం లోని హస్తినాపురం డివిజన్ లో చోటుచేసుకుంది.

కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరితే సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటన హస్తినాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన బొమ్మకంటి నరేష్ (32) భార్య మాధవి, ఇద్దరు ఆడపిల్లలలో కలిసి బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్య నగర్ కాలనీలో నివాసముంటున్నారు.

కాగా మంగళవారం ఉదయం నరేష్ కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే హస్తినాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాయంత్రం నరేష్ మృతి చెందాడు.

వైద్యులు సరియైన చికిత్స చేయకపోవడంతో నరేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నరేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య మాధవి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.

న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News