లైంగిక దాడి.. ఆపై హత్య

లైంగిక దాడి.. ఆపై హత్య;

By :  Ck News Tv
Update: 2025-03-28 04:15 GMT

లైంగిక దాడి.. ఆపై హత్య

మద్యం మత్తులో ఓ మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గురువారం జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు.

ఖాదిరాబాద్‌ గ్రామానికి చెందిన బుసిరెడ్డిపల్లి కిషన్‌ 11వ తేదీన ఉదయం ఇంటి వద్ద గ్రామానికి చెందిన మరో మహిళతో మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన గౌరమ్మ(40) తిట్టింది. దీన్ని మనసులో పెట్టుకున్న కిషన్‌ అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా లోనికి వెళ్లాడు. నన్ను ఎందుకు తిట్టావ్‌ అని కిషన్‌ ప్రశ్నించగా రాత్రిపూట నా ఇంటికి వస్తావా అంటూ మహిళ బెదిరించింది. మద్యం మత్తులో ఉన్న కిషన్‌ ఆమెను శారీరకంగా అనుభవించాడు. అనంతరం గౌరమ్మ పెద్ద మనుషులకు చెప్పి పంచాయితీ పెట్టి పోలీసు కేసు

Full View

పెడతానని అతడిని బెదిరించింది. వెంటనే కోపోద్రేకుడైన కిషన్‌ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి వస్తువులు తీసుకున్నాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు గాను కారంపొడి చల్లి మంచాన్ని తగులబెట్టి ఆ మంటల్లో కాలిపోతుందనుకొని వెళ్లిపోయాడు. మరుసటి రోజు గౌరమ్మ మృతి వెలుగులోకి రాగా మృతురాలి సోదరుడు వీరేశం వట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడిగా కిషన్‌ను భావించి వెతుకుతుండగా గ్రామంలో లేడు. గురువారం గ్రామంలోని తన ఇంటికి వచ్చినట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోగా, కుమారుడు హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.

మహిళ హత్య కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

తిట్టిందని కక్ష పెంచుకొని గొంతునులిమి చంపిన నిందితుడు

అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

Similar News