కీచక టీచర్.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
కీచక టీచర్.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన;
కీచక టీచర్.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
హయత్ నగర్‌లోని భాగ్యలతలో గల 'శ్లోక' స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ తీరు దారుణంగా ఉందని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం వారి తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఆందోళనకు దిగారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న స్టూడెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని స్కూల్ యాజమాన్యాన్ని, సదరు టీచర్‌ను నిలదీశారు. క్లాస్‌లో జరిగిన విషయం తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారని కొట్టడం దారుణమన్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల క్లాస్‌లో ఇంగ్లీష్ టీచర్ పాషా అనవసరమైన లవ్ అనే టాపిక్ గురించి మాట్లాడితే.. ఇదేంటని అడిగిన విద్యార్థినులను కొట్టడమేమిటని ప్రశ్నించారు. వెంటనే సదరు టీచర్‌ను స్కూల్నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
టీచర్ పాషా తాను తెలుగులో మాట్లాడినందుకే కొట్టానని వివరణ ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాష తెలుగులో మాట్లాడితే తప్పేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్కూల్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ ప్రవర్తించిన తీరు సరికాదని, అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ విషయంలో స్కూల్ యాజమాన్యం కఠినంగా ఉంటుందని, టీచర్లు, విద్యార్థులు ఎవరూ అతిక్రమించినా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిలువరించి మాట్లాడి పంపించారు.