తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలు ఎంత కేటాయించారంటే!
తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలు ఎంత కేటాయించారంటే!;
తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలు ఎంత కేటాయించారంటే!
తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే… బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అసెంబ్లీ హాల్లో అభినందనలు తెలిపారు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు.
ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవిన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూల ధనం వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు.
వివిధ రంగాలకు కేటాయింపు ఇలా..
రెైతు భరోసా పథకం రూ. 18,000 కోట్లు
వ్యవసాయం రూ. 24, 439 కోట్లు
పశుసంవర్థక శాఖ-రూ. 1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ- రూ. 5,734 కోట్లు
విద్యాశాఖ రూ. 23, 108 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 31,605 కోట్లు
మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ రూ. 2,862 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమం రూ.40, 232 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 17,169 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ రూ.11, 405 కోట్లు
చేనేత రంగానికి రూ. 371 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ. 3,591 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.3,527 కోట్లు
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు
ఉచిత విద్యుత్ కు రూ.3,000 కోట్లు
విద్యుత్ శాఖ రూ. 21, 221 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12, 393 కోట్లు
మున్సిపల్-పట్టణాభివృద్ధి శాఖ రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ రూ.23,373 కోట్లు
రోడ్లు-భవనాల శాఖ రూ.5,907 కోట్లు
టూరిజం శాఖ రూ.775 కోట్లుస
క్రీడల శాఖకు రూ.465 కోట్లు
అడవులు-పర్యావరణ శాఖకు రూ.1,023 కోట్లు
దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు
హోంశాఖకు రూ.10,188 కోట్లు