*రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం*
*రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం*;
*రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం*
*రంగారెడ్డి జిల్లా గిరిజన ఆదివాసి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను నాయక్*
*కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఆదివాసీ కృషిచేయాలి*
*గిరిజన ఆదివాసి కాంగ్రెస్ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగింపు*
*ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి*
*శిక్షణ తరగతుల్లో గుర్తింపు పత్రాన్ని పొందిన శ్రీను నాయక్*
సికే న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మనమందరం కృషిచేయాలని, అప్పుడే ఇందిరా గాంధీ సూచించిన ఇరవైసూత్రాల కార్యక్రమం అమలవుతుందని రంగారెడ్డి జిల్లా గిరిజన ఆదివాసి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అనంతగిరిలోని హరిత రిసార్ట్లో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాస్థాయి ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత శ్రీను నాయక్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కార్యకర్తలుగా ఎంత కష్టపడుతున్నారో తాను అంతకు రెట్టింపు కష్టపడతానని అన్నారు. రాజ్యాంగంలో 5, 6షెడ్యూలు ప్రత్యేకంగా గిరిజనులకు, ఆది వాసీలకు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీలకు రాజ్యాంగ హక్కులను కట్టబెట్టిందన్నారు. రిజర్వేషన్లు ఉపయోగించుకొని నేడు గిరిజనులు విద్యా, ఉద్యోగరంగాలలో అభి వృద్ధి చెందుతున్నారని తెలిపారు. దానికి కారణం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కారణమని అన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ
తాను రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన పదవిలో ఉండటానికి కారణం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దళిత, గిరిజన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు మాత్రమేనని అన్నారు. ఈదేశంలో ప్రకృతిసంపదపై మొదటిహక్కు గిరిజనులదేనని, ఇందిరాగాంధీ. ప్రభుత్వం జమిందారీ వ్యవస్థ రద్దు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడంతో గిరిజనులకు భూములపై హక్కులు వచ్చాయని గుర్తుచేశారు. అప్పటివరకు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న గిరిజనులు భూములకు యజమానులు అయ్యారని పేర్కొ న్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 25 లక్షల ఎకరాల భూములు దళితులు, గిరిజను లకు పంచి వాటిపై హక్కులు ఇవ్వబడ్డాయని తెలిపారు. 1976లో లంబాడీలు, ఎరుకల, యానాదిలను ఎస్టీ జాబితాలోచేర్చి వారి అభ్యు న్నతికి ఇందిరాగాంధీ తోడ్పడ్డారని గుర్తుచేశారు. యుపిఏ ప్రభుత్వం 2005లో తీసుకువచ్చిన నూతన అటవీచట్టంతో అత్యధిక లబ్దిపొందింది గిరిజనులేనని అన్నారు. 2007లో ఈచట్టం అమలు లోకి వచ్చిందని, తద్వారా లక్షలాదిమంది గిరిజను లకు సాగుచేసుకుంటున్న అటవీ, పోడుభూములపై అటవీ పట్టాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధికోసం 17వేల 167 కోట్లు కేటాయింపు జరిగిందని, రాజీవ్ యువ వికాసంపథకంలో ట్రెకారాద్వారా నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించడానికి ఒక్క ఏడాదికి 1360 కోట్లరూపాయలు కేటాయించారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో 545 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసిందని పేర్కొ న్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ కాగి తాలమీదనే ఉండేవి. తాండాలను గ్రామ పంచా యతీలుగా చేశారు. కానీ అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేది, వారి అభి వృద్ధికి కృషిచేసేది కాంగ్రెస్పార్టీ మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు శిక్షణ పొందిన వారికి ద్రుపత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో ట్రెకా చైర్మన్ బెల్లయ్యనాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు విక్రాంత్ బురియా, ఆదివాసీ కాంగ్రెస్ కన్వీనర్ రాహుల్బల్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ కిషన్నాయక్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు..