జిజిహెచ్ ఆస్పత్రిలో భార్యభార్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్..
జిజిహెచ్ ఆస్పత్రిలో భార్యభార్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్..;
జిజిహెచ్ ఆస్పత్రిలో భార్యభార్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్..
అడిగిన సమాచారం ఇవ్వడం లేదని భార్యభార్తలు పురుగుల మందు డబ్బాతో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఆస్పత్రిలో హల్చల్ చేశారు.
కామారెడ్డి జి జి హెచ్ ఆస్పత్రిలో అడిగిన సమాచారం ఇవ్వడం లేదని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న 2022 సంవత్సరంలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చాననీ, డెలివరీ కోసం ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
గత సంవత్సరం నవంబర్ నెలలో సూరారం వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నానని, జిల్లా ఆస్పత్రిలో తనకు ఆపేరేషన్ చేసిన వైద్యులు ఎవరో తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా గత 14 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నామని అన్నారు.
14 నెలలుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేకపోవడంతో సమాచారం ఇవ్వడం లేదని, 20 రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కదా.. కలెక్టరే ఇస్తారు అని డాక్టర్ విజయలక్ష్మి దురుసుగా మాట్లాడారని, భార్యభార్తలు తెలిపారు.
గురువారం ఇద్దరు తమకు సమాచారం ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని డబ్బాతో జిజిహెచ్ హాస్పిటల్ కు రావడం జరిగిందని తెలిపారు.
అక్కడే ఉన్న ఆస్పత్రి కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు వాళ్ల దగ్గరకు వచ్చి వివరాలు కనుక్కోని, పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.
ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని, ఇలా చేయడం సరికాదని సర్దిచెప్పారు. దాంతో భార్యభార్తలు అక్కడినుంచి వెళ్లిపోవడంతో ఆస్పత్రి వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.