ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. అసహనం వ్యక్తం చేసిన బాధితురాలి భర్త

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. అసహనం వ్యక్తం చేసిన బాధితురాలి భర్త;

By :  Ck News Tv
Update: 2025-03-06 04:35 GMT

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. అసహనం వ్యక్తం చేసిన బాధితురాలి భర్త

తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి ఆ మహిళను తరలించారు.

కాగా డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ఇక్కడ ఎలాంటి వైద్యం చెయ్యలేమని చెప్పడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో మనీషా, ముఖేష్ అనే దంపతులు బైక్ పై రాజీవ్ కాలనీ వెళుతుండగా వెనుక నుండి ఓ వ్యక్తి మద్యం సేవించి బైక్ తో ఢీకొట్టాడు.

దీంతో దంపతులు ఇరువురు బైక్ పై నుండి పడిపోయారు. మనిషా కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Full Viewతీవ్రగాయాలైన మనిషా కు ప్రథమ చికిత్స చేయకుండానే,ఆ మహిళకు ఎలాంటి తగు సూచనలు ఇవ్వకుండానే డ్యూటీలో ఉన్న డాక్టరు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో వారు డాక్టర్ సూచించిన ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు.

దీంతో మనీషా భర్త అసహనానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తాండూర్ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోగులకు వైద్యం నిర్వహించకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సూచించడం సూచనీయమని అన్నారు.

వెంటనే పై అధికారులు ఇలాంటి డాక్టర్లను విధుల్లో నుంచి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News