గురుకులంలో కీచక టీచర్.. తోటి మహిళా ఉద్యోగినికి వేధింపులు...

గురుకులంలో కీచక టీచర్.. తోటి మహిళా ఉద్యోగినికి వేధింపులు...;

By :  Ck News Tv
Update: 2025-03-06 06:04 GMT

గురుకులంలో కీచక టీచర్.. తోటి మహిళా ఉద్యోగినికి వేధింపులు...

మంచిర్యాల జిల్లాలో ఘటన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు

తెలంగాణలోని గురుకులంలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది . తోటి మహిళా ఉద్యోగినిపౌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు . అంతేగాదు మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపర్చాడు నైతం శ్రీనివాస్.

గతంలో కూడా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడని శ్రీనివాస్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Similar News