*అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు*: *ఎస్సై కృష్ణ ప్రసాద్*
సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఉన్నత అధికారుల మేరకు పేరూరు ఎస్సై జి. కృష్ణ ప్రసాద్ తన సిబ్బందితో పెట్రిలింగ్ లో భాగంగా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పేరూరు, రాంపూర్, భీమారం ఇసుక లోడింగ్ ప్రాంతాలను ఆకస్మికంకంగా తనికి చెయ్యగా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్సై అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను మీడియాకు ఈ క్రింది విధంగా తెలియజేశారు.
1.తూనూరి చంటి తండ్రిపేరు ఆనంద రావు, వll 34 సం.లు, గ్రా.పేరూరు, ట్రాక్టర్ నంబర్ TS25G1987, 2. ధాసరి రామయ్య తండ్రి పేరు పోషన్న 40 సం.లు, గ్రా.పేరూరు, ట్రాక్టర్ నంబర్ TS28G 0921, 3. కాకర్లపూ ప్రవీణ్ తండ్రి పేరు సుబ్బా రావు, 40 సం.లు, నిll చెరుకూరు , ట్రాక్టర్ నంబర్ AP20 AN 3480 అను వారు తమ ట్రాక్టర్లలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వారిని పట్టుకుని వారి మీద ఎస్సై కృష్ణ ప్రసాద్ పేరూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
ఈ సంధర్బంగా ఎస్ఐ పేరూరు గారు మాట్లాడుతూ ఇక ముంధు ప్రభుత్వం నుండి అనుమతులు పొందకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారి పైన చట్ట రీత్యా తగు కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు .