అక్రమంగా వాజేడు నుండి ఏటునాగారం తరలిస్తున్న గ్రావెల్ ని నిలిపివెయ్యాలి
ఏటునాగారం తరలిస్తున్న గ్రావెల్ ని నిలిపివెయ్యాలని వాజేడు తాసిల్దార్ కి ఫిర్యాదు చేశారు.;
అక్రమంగా వాజేడు నుండి ఏటునాగారం తరలిస్తున్న గ్రావెల్ ని నిలిపివెయ్యాలి
సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండల అఖిలపక్షం ( కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఎం ) పార్టీలు ఉమ్మడిగా అక్రమంగా వాజేడు నుండి ఏటునాగారం తరలిస్తున్న గ్రావెల్ ని నిలిపివెయ్యాలని వాజేడు తాసిల్దార్ కి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం రెవెన్యూ పరిధిలో 2/6,14/3,34/2,2/5,1/4 ఈ సర్వే నెంబర్లలో గ్రావెల్ తోలుకొనుటకు తాసిల్దార్ అనుమతించినప్పటికీ మైనింగ్ ఏడి వారి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కానీ సదరు గుత్తేదారు పైన సూచించిన సర్వే నెంబర్లలో మైనింగ్ చేయకుండా తాసిల్దార్ సూచించిన జియో క్వారీ ఆర్డినేటర్ పరిధి దాటి అక్రమంగా మండలం నుండి ఎటునాగారం మండలానికి గ్రావెల్ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారు. అందువలన గుత్తేదారునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఫిర్యాదు చేసింది ఈ కార్యక్రమంలో వాజేడు అఖిలపక్ష కమిటీ సభ్యులు, కే వి వి ఎస్ ఎన్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి, పి రామకృష్ణారెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కే రఘువత్తయ్య సిపిఎం కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు