అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే

అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే;

By :  Ck News Tv
Update: 2025-03-12 08:43 GMT

అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే

ఒడిశా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. దీంతో స్పీకర్ సురమా పాధ్యే సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.

మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేసీ మోహపాత్ర ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి మంత్రి ముందుకు వెళ్లి నిల్చున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యుడు తారాప్రసాద్​గల్లాపట్టుకున్నాడు.

దీంతో ట్రెజరీ బెంచీలో సభ్యులు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సభ్యుడు అక్కడి దూసుకెళ్లి ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ సభ్యులు స్పీకర్ ముందు వెల్‎లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారు ఈ ఘర్షణలో కలుగజేసుకోలేదు. సభ్యుల ఘర్షణతో సభ అదుపు తప్పుతుండడంతో స్పీకర్​పాధ్యే మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.

''మిశ్రా నా షర్టు కాలర్ పట్టుకుని నన్ను నెట్టేశాడు. సభ ఆర్డర్‎లో లేనప్పుడు సమాధానం చెప్పడం ఆపేయాలని నేను మంత్రి మోహపాత్రను అభ్యర్థిస్తున్నాను. నేను సున్నితంగా మర్యాద పూర్వకంగా మంత్రిని అడిగాను. కానీ, జయనారాయణ మిశ్రా సడెన్​గా నా దగ్గరకు వచ్చి నా కాలర్ పట్టుకొని తోసేశాడు' అని అసెంబ్లీ ప్రాంగణంలో తారాప్రసాద్ మీడియాతో పేర్కొన్నారు.

Similar News