నేను కలెక్టర్‌ను.. ఇంట్లోకి రావచ్చా..?
నేను కలెక్టర్‌ను.. ఇంట్లోకి రావచ్చా..?;
నేను కలెక్టర్‌ను.. ఇంట్లోకి రావచ్చా..?
పల్లె బాటలో భాగంగా రామన్నపేట మండలం ఇస్కిల్లకు వెళ్లిన యాదాద్రి కలెక్టర్హనుమంతరావుకు రోడ్లపై చెత్త, శుభ్రం చేయని మురుగు కాల్వలు దర్శనమిచ్చాయి.
ఇండ్ల వద్దకు వెళ్లిన ఆయన 'నేను కలెక్టర్‌ను.. ఇంట్లోకి రావచ్చా..? అని పర్మిషన్తీసుకొని లోనికి వెళ్లారు. తమ వద్దకు వచ్చిన ఆయనకు పలువురు సమస్యలను చెప్పుకున్నారు. వారి సమస్యలను పూర్తిగా విన్న ఆయన.. వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
డల ఆఫీసర్లు ఉరుకులు, పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. ఓపెన్ ప్లేస్‌లో చెత్త కన్పించడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు.
చెత్త ఎవరు వేశారో వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. బండిలోనే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోచోట శుభ్రం చేయని మురుగుకాల్వ నుంచి దుర్బంధం వస్తుండం, దోమలు తిరుగుతూ ఉండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెరిగిన కలుపు మొక్కలు వెంటనే తొలగించాలని ఆదేశించారు.
గ్రామంలో గర్భిణుల సంఖ్యను అడిగి తెలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని వైద్య సిబ్బందికి సూచించారు. స్కూళ్లలో స్టూడెంట్స్సంఖ్య తెలుసుకొని వారికి మంచిగా చదువు చెప్పాలన్నారు.
ఇంట్లోకి రావచ్చా..?
పలు ఇండ్ల వద్దకు వెళ్లిన ఆయన 'నేను కలెక్టర్‌ను వచ్చాను. మీ ఇంట్లోకి రావచ్చా..?' అని పర్మిషన్ అడిగారు. దీంతో ఆయనను లోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్లు ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు.
రోజుకు ఎన్ని గంటలు నీళ్లు వస్తున్నాయి.. రేషన్ బియ్యం ఇస్తున్నరా..? ఫ్రీ కరెంటు, గ్యాస్ సబ్సిడీ వస్తుందా..? అని పశ్నించి వారి వద్ద నుంచి సమాధానాలు రాబట్టారు. ఆయన వెంట డీఆర్డీఏ నాగిరెడ్డి, డీపీవో సునంద తదితరులు ఉన్నారు.